Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అదుపుతప్పి పెట్రోల్ బంక్‌ను ఢీకొట్టిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం

TGSRTC Bus crashes into petrol bunk after losing control major accident averted
Advertisement
  • హైదరాబాద్ శివార్లలోని పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
  • అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి బాటసింగారంలో ఘటన
  • బైక్‌ను తప్పించే క్రమంలో అదుపుతప్పడంతో ప్రమాదం
  • ప్రమాదంలో కారు, మరో వాహనం, డీజిల్ పంప్ ధ్వంసం
  • సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ప్రమాద దృశ్యాలు
Advertisement
హైదరాబాద్ శివార్లలో టీజీఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన బస్సు వేగంగా ఓ పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లడంతో అక్కడున్న వాహనాలు, యంత్ర పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది, ప్రయాణికులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాటసింగారం వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వైపు వెళుతుండగా, మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డ్రైవర్ బస్సును పక్కకు మళ్లించాడు. అయితే, బస్సు అధిక వేగంతో ఉండటంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో బంక్‌లో ఆగి ఉన్న ఒక కారు పూర్తిగా ధ్వంసం కాగా, మరో వాహనం పాక్షికంగా దెబ్బతింది. బస్సు నేరుగా డీజిల్ ఫిల్లింగ్ పాయింట్‌ను ఢీకొట్టడంతో అక్కడి యంత్ర పరికరాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఓ పెట్రోల్ పంప్ ఎగిరిపడింది. ఒక్కసారిగా బస్సు దూసుకురావడంతో పెట్రోల్ బంక్ సిబ్బంది, వాహనదారులు భయాందోళనలతో పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
Advertisement
Advertisement
TGSRTC Bus
Hyderabad Petrol Bunk Accident
Batasingaram Road Accident
Abdullapurmet Bus Crash

More Telugu News